Pages

Tuesday, July 10, 2012

EEGA EFFECT ON NANI

రాజమౌళి తీసిన ఈగ సినిమా గురించి రకరకాలుగా కామెంట్లు విన్పిస్తున్నాయి. కొందరు చాలాబాగుందని చెబితే. మరికొందరు శంకర్‌తీసిన 'రోబో'లో దోమసీన్‌ ఇన్‌స్పిరేషన్‌తో తాను ఈగ తీశారని అంటున్నారు. ఇంకొందరు కథేం కొత్తదికాదు. కామంతో రగిలిపోయే వ్యక్తి హీరోయిన్‌ను ప్రేమించి పొందాలనుకుంటాడు. ఇలాంటి కాన్సెప్ట్‌తోవచ్చిన చంద్రముఖి హిట్‌ అయింది. అందులో విలన్‌కు బాగా పేరువచ్చింది. అలాగే ఈగలో కూడా కన్నడ నటుడు సుదీప్‌ కూడా కామంతో సమంతాపై రగిలిపోతుంటాడు. ఆ క్రూరత్వం బాగా పోషించాడు. ఇలాంటివి వుంటేనే ప్రేక్షకులు చూస్తున్నారంటూ...
విమర్శిస్తున్నారు. ఫిలింనగర్‌లో మాత్రం ఈగ సినిమాను కేవలం పిల్లలు బాగా ఎంజారు చేస్తారని చెబుతున్నారు. రాజమౌళి కూడా ఈగ పిల్లలకు బాగా నచ్చుతుందని రిలీజ్‌కుముందు చెప్పాడు కూడా. ఏదిఏమైనా ఈ చిత్రం బాగానే రన్నింగ్‌లో వుంది. ఈ దెబ్బతో కొన్ని సినిమాలు కూడా వారం పోస్టుపోన్‌ అయ్యాయి. అయితే ఆదివారంనాడే ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు శంకర్‌ చూసి బాగా స్పందించారు. చెన్నైలోని థియేటర్‌లో చూసి విజిటర్స్‌బుక్‌లో 'సూపర్‌ ఫిల్మ్‌' అని మెసెజ్‌ రాశాడు. ఇటీవలే మహేష్‌బాబు కూడా చూసి ఇప్పటి వరకు వచ్చిన గ్రేట్‌ ఫిల్మ్‌లో ఇదొకటిగా ట్వీట్‌ చేశాడు. ఇక మిగిలిన ప్రముఖ దర్శకులు హీరోలు కూడా ట్విట్టర్‌లో రాజమౌళి టేకింగ్‌ను ప్రశంసిస్తూ రాశారు. అందరికంటే బాగా మెచ్చుకుంది మాత్రం ప్రతినాయకుడు సుదీప్‌ను. ప్రముఖ హీరోలు తమ చిత్రాల్లో బుక్‌చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధంచేశారు. ఎటొచ్చీ పేరురానిది నానికి మాత్రమే.

1 comment: